టీడీపీ విజయోత్సాహం.. ఆత్మీయ విందులో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు!,రాటకొండ రంగారెడ్డి (చిన్ని)

బీజేపీ నేత గుత్తా హరికృష్ణ, 15వ వార్డు కౌన్సిలర్ ఎస్‌ఎల్‌వీ రఘు ఆహ్వానం మేరకు హాజరు..

మదనపల్లె:

మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆత్మీయ విందు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు.మదనపల్లె బైపాస్ రోడ్డులోని రామతులసి కళ్యాణ మండపంలో 15వ వార్డు కౌన్సిలర్ ఎస్‌ఎల్‌వీ రఘు ఆధ్వర్యంలో ఈ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ నేత గుత్తా హరికృష్ణ, కౌన్సిలర్ ఎస్‌ఎల్‌వీ రఘు ఆత్మీయ ఆహ్వానం మేరకు చినబాబు కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వాహకులు చినబాబుకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి విందులో పాల్గొన్నారు. ఎన్నికల విజయానంతరం వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య కొనసాగుతున్న ఆత్మీయ పలకరించుకున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *