ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాలి

మదనపల్లె, అక్టోబర్ 21: మదనపల్లె మున్సిపల్ చైర్మన్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం వేగవంతం చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. బుధవారం టిడిపి చైర్మన్ అభ్యర్థి శ్రీ రామకుమార్ చినబాబు నివాసానికి చేరుకున్న మంత్రి, ఎన్నికల నిర్వహణ అంశాలపై శ్రీరామకుమార్ చినబాబుతో చర్చించారు.

మదనపల్లెలో రాజకీయ సమాలోచనలు.. ఎన్నికలపై కసరత్తు!

మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ చిన్నబాబు గారి స్వగృహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు విచ్చేశారు.

ఈ సందర్భంగా జనసేన రాయలసీమ కో-కన్వీనర్ రాందాస్ చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరామ, మండ్యం ప్రభాకర్, ఖాన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాయకులు సమావేశమై ఎన్నికల వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *