పత్రికా ప్రకటన

అక్రమ మద్యం నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.

మైనింగ్ కార్యకలాపాల్లో పారదర్శకత, ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

ఎక్సైజ్, గనుల శాఖల పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖలు మరియు టి ఈ ఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, ఐ.ఏ.ఎస్. సమీక్ష.

మదనపల్లి, జూలై 31: (gtvmedia)

జిల్లాలో అక్రమ మద్యం నిర్మూలన, బహిరంగ మద్యపాన నియంత్రణ, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖలు మరియు టి ఈ ఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, ఐ.ఏ.ఎస్. అధికారులను ఆదేశించారు.

శుక్రవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా ఎక్సైజ్ శాఖ,మైనింగ్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్, గనుల శాఖల పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖలు మరియు టి ఈ ఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..
జిల్లాలో ఐడీ లిక్కర్ కు సంబంధించిన నేరాలను గణనీయంగా తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలివచ్చే మద్యాన్ని అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత బలోపేతం చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎన్ డి పి ఎల్ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మైనింగ్ శాఖ పనితీరుపై సమీక్షలో భాగంగా జిల్లాలో ప్రస్తుతం అమలులో ఉన్న వర్కింగ్ లీజులు,నాన్-వర్కింగ్ లీజులు వాటి ప్రస్తుత స్థితిని అధికారులు వివరించారు. నాన్-వర్కింగ్ లీజులు ఎందుకు ప్రారంభం కాలేదనే అంశాలపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో మైనింగ్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, వర్కింగ్ లీజులు, నాన్-వర్కింగ్ లీజుల పరిస్థితి, ఖనిజ ఆదాయం, ఇసుక సరఫరా తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఎక్సైజ్, గనుల శాఖలు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ… జిల్లాలో ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధరలు పెరగకుండా, ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా
సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇసుక ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్ఠాత్మకముగా వడ్డెర సహకార సంఘాలకు కొరకు భవన నిర్మాణ రాయి, రోడ్డు మెటల్, గ్రావెల్, స్లేట్, క్యూబ్స్ మరియు కర్బ్స్ వంటి ఖనిజాల క్వారీ లీజుల ప్రాధాన్యతలో భాగముగా, మైన్స్ అండ్ జియాలజి వారు వడ్డెర సహకార సంఘాల కొరకు 14 హెక్టార్ల భూమిని గుర్తించడము జరిగినది. భూముల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి అవసరమైన ఎన్‌ఓసీల (NOCs) మంజూరును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా జిల్లాలో ఖనిజాల ద్వారా లభిస్తున్న ఆదాయం, జిల్లా పునర్వ్యవస్థీకరణ అనంతరం వచ్చిన ఆదాయ మార్పులు, కొత్తగా జిల్లాలో చేరిన ప్రాంతాలకు కలుగుతున్న ప్రయోజనాలపై అధికారులు సమగ్ర వివరాలను సమావేశంలో వివరించారు.

మైనింగ్ శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు, లీజులు, ఆదాయ వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పారదర్శకంగా పనులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు, ప్రక్రియలను జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ కళ్యాణి, కడప జిల్లా డిప్యూటీ కమిషనర్ జయరాజ్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్,గనుల శాఖ ఏడి రంగ కుమార్, ఎక్సైజ్ ఏఈఎస్‌లు జోగేంద్ర, పద్మావతి, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు,గనుల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
—————-///————–
డి ఐ పి ఆర్ ఓ,అన్నమయ్య జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *