ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఈచర్.. వ్యక్తి మృతి

కురబలకోట, ఆగస్టు 22: (gtvmedia)అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ఫ్లైఓవర్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఈచర్ వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరుకు నిమ్మకాయలు తీసుకెళ్లి విక్రయించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్లైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఈచర్ వాహనం ఢీకొట్టడంతో వాహనంలో ఉన్న కడప జిల్లా నేల తిమ్మయ్యగారిపల్లెకు చెందిన సయ్యద్ హుస్సేన్ పీరా (48) తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

GTV | అన్నమయ్య జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *