మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం వారు ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అకాడమీ (E&ICT Academy) సహకారంతో “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ వైర్లెస్ కమ్యూనికేషన్ : రీసెంట్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ అప్లికేషన్స్ ” అనే అంశంపై 10 రోజుల ఆన్లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించిన విభాగంను ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అభినందనలు తెలియజేసారు. 10 రోజుల పాటు ఈ కార్యక్రమంలో ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్. అనురాధ, ఐఐఎస్సీ బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ టి. శ్రీనివాస్, ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ పి.కె. సాహు యూ వక్తలు గా వ్యవహరించారని భవిష్యత్తు అందుబాటులోకి రానున్న 6జీ సమాచార వ్యవస్థల్లో ప్రదేశ ఆధారిత సంకేత ప్రసారం, యాంటెన్నా సూచికల ద్వారా సమాచార ప్రసారం వంటి ఆధునిక పద్ధతుల ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం లో వివరించారని ఆయన అన్నారు. తక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తూ, ఎక్కువ సమాచారాన్ని వేగంగా పంపే విధానాలను మరియు పరికరాల నిర్మాణ సంక్లిష్టతను తగ్గించి, సమాచార ప్రసార సామర్థ్యాన్ని పెంచే అవకాశాలను ఇందులో వివరించారని ఆయన అన్నారు. ఈ 10 రోజుల ఆన్లైన్ శిక్షణా కార్యక్రమంలో 5G సాంకేతికత, భవిష్యత్ తరాల వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు, వాటి ఆచరణాత్మక అనువర్తనాలపై అధ్యాపకులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన 100 మందికి పైగా అధ్యాపకులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారని అన్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, నిపుణులు వివిధ సాంకేతిక అంశాలపై ఉపన్యాసాలు అందించి, వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గోరె, కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎం రంజిత్ మరియు డాక్టర్ సుబ్బారావు లు పాల్గొన్నారు.
మిట్స్‌లో వైర్లెస్ కమ్యూనికేషన్‌పై 10 రోజుల ఆన్లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
