చినబాబు, 15వ వార్డు జనసేన అభ్యర్థి చరణ్ విజయమే లక్ష్యంగా మంత్రి మండిపల్లి విస్తృత ప్రచారం

మదనపల్లె, అక్టోబర్ 29:

మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామకుమార్ (చినబాబు)తో పాటు, 15వ వార్డు కమ్మపల్లెలో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చరణ్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలను, ఓటర్లను కలిసి మద్దతు కోరారు.

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మదనపల్లె మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చినబాబుతో పాటు 15వ వార్డు జనసేన అభ్యర్థి చరణ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటరును కలిసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *