మదనపల్లె, అక్టోబర్ 29: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం ఉదయం 22, 23, 24వ వార్డులతో పాటు కమ్మ వీధి, వాల్మీకి వీధి సర్కిల్, చిత్తూరు బస్టాండ్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు)కు మద్దతుగా ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, పార్టీ కార్యదర్శి రాటకొండ మధుబాబు, సాకే కృష్ణమూర్తి, వంటి కొండ వెంకటేష్, పూల మురళి, రామాంజులు, అన్వర్ భాష, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మున్నా నాయక్‌తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

