ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

మదనపల్లె సెప్టెంబర్ 17 : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మదనపల్లిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా మదనపల్లి పట్టణం వరాల ఆంజనేయస్వామి ఆలయం వద్ద మృత్యుంజయ హోమం నిర్వహించారు. పలువురు బిజెపి నాయకులు రక్తదానం నిర్వహించారు. నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
మాధవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. విశ్వకర్మ జయంతి రోజునే నరేంద్ర మోడీ జన్మించడం, గొప్ప విశేషం అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, జిల్లా అధ్యక్షుడు నరేంద్ర, బిజెపి సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, సేతు, జబ్బల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *