మదనపల్లె రూరల్ మండలం కోళ్లబైలు-1 ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డి వారి రాజారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి గంగారపు రాందాస్ చౌదరి గారి ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ అభ్యర్థి రాజారెడ్డికి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి, వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలు ఓటర్లను కోరారు.

