మదనపల్లి, ఆగస్టు 28: (gtvmedia)రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లి నియోజకవర్గ మహిళలు తమ అభిమాన ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషాకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకలకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు హారతి ఇచ్చి, నుదుటన తిలకం దిద్ది, చేతికి రాఖీలు కట్టారు. అనంతరం ఎమ్మెల్యేకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళలు మాట్లాడుతూ.. మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తమకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన ఈ వేడుక ఆత్మీయ వాతావరణంలో సాగింది. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

