SIR ప్రక్రియను నాణ్యతతో.. గడువులోగా పూర్తి చేయాలి

చిన్నమండెం ఉర్దూ పాఠశాలలో SIR ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

చిన్నమండెం, ఆగస్టు 22: (gtvmedia)ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా శనివారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చిన్నమండెం మండలంలోని ఉర్దూ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియతో పాటు ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలోని Absent, Shifted, Dead (ASD) జాబితా, Logical Discrepancies, No Mapping కేసుల వివరాలను పరిశీలించారు.

ఆయా కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసిన విధానం, నోటీసుల అనంతరం నిర్వహించిన హియరింగ్‌కు హాజరైన వారి వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. హియరింగ్‌కు హాజరుకాని ఓటర్ల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

SIR ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సూచించారు. ఓటరు జాబితా సవరణలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామాంజనేయులు, ఎన్నికల శాఖ అధికారులు, ఎంపీడీవో శ్రీధర్ రెడ్డి, బూత్ లెవల్ అధికారులు (BLOలు) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *