మదనపల్లె, ఆగస్టు 11: ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నేడు మదనపల్లి పట్టణం 15 వార్డు పరిధిలోని కమ్మవీధి సర్కిల్ నుంచి ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు.. ఎమ్మెల్యే రాక సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు… కమ్మ వీధి సర్కిల్ నుంచి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 90% హామీలను నెరవేర్చి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. మదనపల్లి అభివృద్ధి కోసం వంద కోట్లు పైగా ఖర్చు చేసి రోడ్లు, డ్రైనేజీలు, తాగినీటి బోర్లు, వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని.. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పూర్తిచేసి మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, రామిశెట్టి నీలకంఠ, మోడెం సిద్ధప్ప, రాటకొండ మధుబాబు, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి, శాలివాహన డైరెక్టర్ భావన, మాజీ కౌన్సిలర్ బాబ్జి, పెరవల్లి మధు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, వెంకటేష్, యువ నాయకులు రానా, విజయమ్మ, జాఫరున్నిస, నాదెళ్ల శివ, మల్లికార్జున నాయుడు, భారతి నాయుడు, ఖజా హుస్సేన్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

