మదనపల్లె, ఆగస్టు 9: (gtvmedia)మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషతో కలిసి బెంగళూరుకు చెందిన బిస్మిల్లా షా ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ జమాల్ సాబ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు, క్రీడాకారులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో షాహిన్ గ్రూప్ చైర్మన్ ఖదీర్ అహ్మద్ సాబ్, డాక్టర్ నవీద్ సాబ్, సయ్యద్ ఖాద్రి సాబ్, లేపాక్షి ఫజులుల్లా, ముఫ్తీ ఫుజైల్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
