మదనపల్లి, ఆగస్టు 28: (gtvmedia)వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన తమకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీపీ పదవి కల్పించారని, ఆయనకు ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఎంపీపీ రెడ్డెమ్మ, వెలుగు చంద్ర పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన 25 మంది ఎంపీటీసీలను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రెడ్డెమ్మ మాట్లాడుతూ ఐదేళ్లపాటు మండల అభివృద్ధికి సహకరించిన ఎంపీటీసీలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధి కోసం అందరూ సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు.
వెలుగు చంద్ర మాట్లాడుతూ తాము 2011 నుంచి వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్నామని తెలిపారు. సీటీఎం సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఎంపీ మిథున్ రెడ్డి తమకు అండగా నిలిచారని చెప్పారు. 2019లోనే ఎంపీపీ పదవి విషయంలో మిథున్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి 2021లో తమను ఎంపీపీగా గెలిపించారని తెలిపారు.
తమపై నమ్మకం ఉంచి పదవి కల్పించిన మిథున్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని, చివరి ప్రాణం వరకు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని వెలుగు చంద్ర స్పష్టం చేశారు.
