అమరావతి: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులందరికీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించుకుంటారని పేర్కొన్నారు.

