కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరణ
మదనపల్లి, ఆగస్టు 10: (gtvmedia)
మదనపల్లి మండలంలోని ఈశ్వరమ్మ కాలనీలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లస్టర్ ఇంచార్జ్ మాకినేని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు తదితర అంశాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా నాయకులు అడిగి తెలుసుకున్నారు.
ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జ్ బాలాజీ, మదనపల్లి మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల గిరితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

