పాఠశాల వద్దకు వెళ్లి తరగతులను నిలిపివేసిన నాయకులు.. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలని డిమాండ్
మదనపల్లె, ఆగస్టు 9: (gtvmedia)సెలవు రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో యూఎస్‌ఎఫ్‌ఐ అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు మదనపల్లె పట్టణంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా తరగతులను నిలిపివేసి విద్యార్థులను ఇళ్లకు పంపించినట్లు యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు.
యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆఫ్రిద్, కార్యదర్శి కమలాకర్ మాట్లాడుతూ సెలవు రోజుల్లోనూ విద్యార్థులతో తరగతులు నిర్వహించడం వల్ల వారిపై మానసిక, శారీరక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు విశ్రాంతి సమయం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పాఠశాలలపై తనిఖీలు చేయాలి
సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు.
విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే చర్యలను సహించబోమని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మనోజ్, యాసేన్, సాయి తదితరులు పాల్గొన్నారు.
