“రెండేళ్ల నమ్మకం–సంక్షేమం–అభివృద్ధి” పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
మదనపల్లె, ఆగస్టు 8: (gtvmedia)రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో మదనపల్లెలో “రెండేళ్ల నమ్మకం–సంక్షేమం–అభివృద్ధి” పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మరింతగా మమేకం కావాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్, మాజీ కౌన్సిలర్ నాదెళ్ల బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
