మదనపల్లి, ఆగస్టు 6:( gtvmedia)మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలంలో నిర్వహిస్తున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మండలంలోని బండ్లపల్లి, ముష్టూరు గ్రామాల్లో స్థానిక కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రజలను కలిసి, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విజయాలను వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ, నిమ్మనపల్లి మండల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నందున, రానున్న ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు కూటమి పార్టీల నాయకులకే ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ ఎంపీపీ రెడ్డప్ప, ఆర్ జే వెంకటేష్,మునిరత్నం, గంగారపు నవీన్ చౌదరి,సీనియర్ నాయకులు రాటకొండ మధు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
