అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు పాలన

మదనపల్లి ఆగస్టు 5 : (gtvmedia)రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన అందిస్తున్నాడని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచిపాల తులసి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని త్యాగరాజ వీధిలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ చారి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ ఆ ఇంటి కుటుంబీకులకు ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమాన్ని వివరిస్తూ, వారి కరపత్రాలను అందజేసారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టిడిపికే పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *