మదనపల్లి మండల వైస్ ఎంపీపీగా మాకినేని చంద్రశేఖర్ ఎన్నిక..

మదనపల్లె: మదనపల్లి మండలం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాకినేని చంద్రశేఖర్ మండల వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. పలువురు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సహకారం అందిస్తూ రాజకీయంగా తనదైన సేవలు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆయనకు వైస్ ఎంపీపీగా సముచిత స్థానం కల్పించడంపై చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్య నాయకులకు, మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ భాషా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మాకినేని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *