ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లి, నవంబర్ 20: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మదనపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ భాషా గారి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను ఎమ్మెల్యే సావధానంగా విన్నారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యలపై తక్షణమే స్పందించి నిబంధనల ప్రకారం న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు.

అనంతరం ప్రసాద్ రెడ్డికి వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన రూ.30,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే కొనసాగించిన ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *