రాయచోటి: అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్గా రేపు మదనపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్న సుగవాసి ప్రసాద్ బాబును మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా తనయుడు, జునైద్ అక్బరి నేడు రాయచోటిలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి జడ్పీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
