రాయలసీమ రైతు సత్తాను ప్రపంచానికి చాటుతాం: నారా లోకేష్

మదనపల్లె: రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసి, ఈ ప్రాంత రైతుల సత్తాను ప్రపంచానికి చాటుతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

యువగళం పాదయాత్ర సందర్భంగా రాయలసీమలో 1,587 కిలోమీటర్లు పర్యటించి రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నానని లోకేష్ తెలిపారు. ఆ అనుభవంతోనే 2023లో ‘మిషన్ రాయలసీమ’ ప్రకటించామని, అందులో ప్రధాన లక్ష్యాల్లో హార్టికల్చర్ హబ్ ఒకటని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు సహకారంతో ఆ కల సాకారమవుతోందన్నారు. 

విత్తనం నుంచి ప్రపంచ స్థాయి ఉత్పత్తుల వరకు పరిశోధన, ఉత్పాదకత, కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్, యాంత్రీకరణ, ఆధునిక వ్యవసాయ విధానాలపై హబ్‌లో దృష్టి సారిస్తామని తెలిపారు. రైతుల ఆదాయం పెంచడం, రాయలసీమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 

ఐఎస్‌బీ స్ఫూర్తితో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను కూడా ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *