‘మురసు’ తుపానుతో అతి వేగంతో పెనుగాలులు వీచే ముప్పుందని *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు.
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎస్పీ సూచన.
చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలవవద్దని, తెగిపడిన తీగలను తాకవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
రహదారులపై పొంగే వాగులు, కాలువలు దాటే సాహసం ఎవరూ చేయరాదని ఎస్పీ స్పష్టం చేశారు.
నీరు చేరిన రోడ్లపై వాహనాల రాకపోకలను వెంటనే ఆపాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఎస్‌హెచ్‌ఓలు మండల అధికారులతో వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.
క్షేత్రస్థాయి నివేదికలను ఎప్పటికప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌కు పంపాలని ఎస్పీ ఆదేశించారు.
అత్యవసర సహాయం కోసం ప్రజలు వెంటనే ‘డయల్ 112’ను సంప్రదించాలని ఎస్పీ కోరారు.
