మదనపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మదనపల్లె పట్టణంలోని కమ్మవీధిలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జి, రాజంపేట పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరి నివాసంలో రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితులు, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల కార్యాచరణ తదితర అంశాలపై ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో గంగారపు శ్రీ వెంకట నరేన్ బాబు, సీడ్ మల్లికార్జున నాయుడు, గుండాల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

