కురబలకోట, సెప్టెంబర్ 25: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ హాజరయ్యారు. కురబలకోట మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, అభ్యర్థనలు, ఇబ్బందులను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను శంకర్ యాదవ్ దృష్టికి తీసుకురాగా, ఆయన ప్రతి సమస్యను ఓపికగా విని సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ, బాధితులకు భరోసా కల్పించారు.
ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం కోసం అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా ప్రజలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శంకర్ యాదవ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
