నేటి సాయంత్రంతో ముగియనున్న పురపాలక ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్, అక్టోబర్ 30:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న పురపాలక ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. నవంబర్ 1వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఏర్పాట్లు చేపట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా 12,244 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 1.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రచారం ముగియనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చివరి రోజు ఓటర్లను కలుసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *