వాల్మీకిపురం, అక్టోబర్ 23: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పట్టణంలో వైసీపీ నాయకులు నిర్వహించిన ధర్నాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులను అడ్డుకుంటున్నారంటూ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడు చింతల సాయికృష్ణారెడ్డిపై ఆరోపణలు చేస్తూ వైసీపీ నాయకులు స్థానిక గాంధీ బస్టాండ్ వద్ద నిరసనకు దిగారు.
ధర్నా సందర్భంగా పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనలో కొంతమంది వైసీపీ నాయకులను పోలీసులు వాల్మీకిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి తలెత్తిన వివాదంతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.


