రామసముద్రం మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే షాజహాన్ భాషా సమీక్ష

రామసముద్రం, సెప్టెంబర్ 24: రామసముద్రం మండలంలో తాగునీటి సరఫరా, మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా సమీక్ష నిర్వహించారు. రామసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల మండల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామసముద్రం మండల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మండలంలోని తాగునీటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

మదనపల్లి–రామసముద్రం మధ్య డబుల్ రోడ్డు పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మారుమూల గ్రామాల్లోని అర్హులైన లబ్ధిదారులకు కూడా ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *