మిట్స్‌లో జెనరేటివ్ ఏఐ, ఐబీఎం బాబ్ టూల్‌పై అవగాహన కార్యక్రమం

మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు మిట్స్ స్కిల్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో సి.ఎస్.ఈ-ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఐబీఎం స్కిల్ బిల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెనరేటివ్ ఏఐ మరియు ఐబీఎం బాబ్ టూల్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మరియు ఐబీఎం స్కిల్ బిల్డ్ మాస్టర్ ట్రైనర్ ఏలూరి నరేంద్ర పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక రంగంలో జెనరేటివ్ ఏ ఐ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. జెనరేటివ్ ఏఐ అనేది మనుషులు అందించే సూచనలు లేదా సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కోడ్, ప్రెజెంటేషన్లు, నివేదికలు వంటి వివిధ రకాల కంటెంట్‌ను రూపొందించగల ఆధునిక కృత్రిమ మేధస్సు సాంకేతికత అని అన్నారు. విద్య, పరిశోధన, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఆరోగ్య రంగం, వ్యాపారం, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో జెనరేటివ్ ఏఐ వినియోగం విస్తరిస్తోందని అన్నారు. ఐబీఎం బాబ్ సాఫ్ట్‌వేర్ సాధనం ద్వారా కృత్రిమ మేధస్సు సహాయంతో కోడ్ రూపొందించడం, కోడ్‌లోని లోపాలను గుర్తించి సరిచేయడం, ఇప్పటికే ఉన్న కోడ్‌ను అర్థం చేసుకోవడం, వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం, సాఫ్ట్‌వేర్ అనువర్తనాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు . చిన్న స్థాయి సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టుల రూపకల్పన నుంచి సంక్లిష్టమైన ప్రోగ్రామింగ్ సమస్యల పరిష్కారం వరకు ఏఐ సాధనాలను ఎలా వినియోగించుకోవచ్చో ప్రదర్శనల ద్వారా వివరించారు ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏ.పి.ఎస్.ఎస్.డి.సి కోఆర్డినేటర్ పి. మొహమ్మద్ రిజ్వాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్. సుబ్రహ్మణ్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *