మదనపల్లె, జూలై 31 (GTV MEDIA): కూటమి ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్ది రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని టీడీపీ సీనియర్ నేత ఆర్.జె. వెంకటేష్ కోరారు.
నిమ్మనపల్లి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ అధికారుల అవగాహన లోపంతో మ్యూటేషన్, పాస్బుక్లు, డీకేటీ భూముల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే 22ఎ భూముల సమస్యలు, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, మాజీ సర్పంచ్ రాజన్న, రెడ్డెప్ప, లోకేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
