ములకలచెరువు: (gtvmedia)అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా జి. శంకర్ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం నియమించడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ యాదవ్‌కు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ములకలచెరువులో తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ శంకర్ యాదవ్‌ను సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి సమన్వయంతో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
శంకర్ యాదవ్ నియామకంతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పవన్ రెడ్డి, రెడ్డి సురేష్, మారుజోల్లా సుదర్శన్, కామాక్షి ఆంజనేయులు, మధుకర్, కామాక్షి రాంబాబు, తోట చంద్రమోహన్, రోహిత్ శర్మ, పవన్ కుమార్, ఏసు ఆది, ఏసు హరి, ఏసు రాకేష్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
