మదనపల్లె సమీపంలో గల మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని విద్యార్థులకు సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో న్యూ ఢిల్లీ లోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వారి ఐడియా ల్యాబ్‌ను యూనివర్సిటీ లో న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహార మరియు ప్రజా పంపిణీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్ కుమార్ చేతులమీదుగా ఘణంగా ప్రారంభించారు. ప్రో-ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, అడ్వైజర్ (ఆర్ అండ్ డీ) డాక్టర్ ఆర్. తులసీరామ్ నాయుడు, వుబిగఃధిపతులు మరియు విద్యార్థుల సమక్షంలో ల్యాబ్‌ను ప్రారంభించారు.
కార్యక్రమంలో సతీష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలను ఆచరణాత్మక నమూనాలుగా రూపొందించేందుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమాజానికి, పరిశ్రమలకు ఉపయోగపడే పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఐడియా ల్యాబ్ దోహదపడుతుందని తెలిపారు. ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన త్రీడీ ప్రింటర్లు, త్రీడీ స్కానర్, లేజర్ కట్టింగ్ యంత్రాలు, సిఎన్‌సీ రౌటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వ్యవస్థలు, ఇతర ఆధునిక పరికరాలను ఈ ల్యాబ్ లో స్థాపించారని, తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాలను ఆచరణలోనికి తీసుకురావడానికి ఇలాంటి ల్యాబ్ లు ఉపయోగిస్తూ, సమస్యలను పరిష్కరించడం, కొత్త నమూనాలను తయారు చేయడం, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ఇతర విభాగాల విద్యార్థులతో కలిసి పనిచేయడం వంటి నైపుణ్యాలను విద్యార్థులు అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక రంగ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు, పరిశోధనలు, నూతన ఆవిష్కరణల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకునే పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ ల్యాబ్ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి తమ ఆలోచనలను కార్యాచరణ నమూనాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఉపయోగకరమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ ఎస్. భాస్కరన్, డాక్టర్ జగదీష్ బాబు. బి, అధ్యాపకులు, సాంకేతిక నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.



