మిట్స్ యూనివర్సిటీ ఎం.సి.ఏ విద్యార్థులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ ఈసిఎస్ఎస్ స్కాలర్‌షిప్‌లు

మదనపల్లె ,సెప్టెంబర్ 20:(మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎం.సి.ఏ. రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ (ECSS ) ప్రోగ్రామ్ – మెరిట్-కమ్-నీడ్ బేస్డ్ స్కాలర్‌షిప్‌లు అందజేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, విద్యార్థుల మెరిట్ మరియు ఆర్థిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి సంవత్సరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ ఈ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నట్లు తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ నందు ఎం.సి.ఏ. రెండవ సంవత్సరం చదువుతున్న బి. అరుణ్ కుమార్, కె. హర్షిత, పప్పులేటి పవిత్ర, ముషారఫా నాజ్ షేక్ లకు ఒక్కొక్కరికి ₹75,000 చొప్పున మొత్తం ₹3,00,000/- (అక్షరాలా మూడు లక్షల రూపాయలు) స్కాలర్‌షిప్‌గా అందినట్లు తెలిపారు. స్కాలర్‌షిప్‌లు పొందిన విద్యార్థులను మిట్స్ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, సీనియర్ మేనేజర్- స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సమీనా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.సురేష్ కుమార్ మరియు తదితరులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *