మదనపల్లి మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ ఖరారు

మదనపల్లె : మదనపల్లె పట్టణ ప్రజలు వార్డు కౌన్సిలర్లు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో 35 వార్డులు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 48 చేరుకునింది. 1.17 లక్షల ఓట్లు ఉన్న మదనపల్లిలో.. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి.

మదనపల్లె:అన్నమయ్య జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మదనపల్లె మున్సిపాలిటీలోని 48 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీ-1 (వార్డు 33 జనరల్), ఎస్సీ-3 (వార్డు 9 మహిళ, 7, 32 జనరల్), బీసీ-20 (వార్డులు 2,3,5,6,19,22,29,44,45,46 మహిళ, 1,4,25,26,27,36,42,43,47,48 జనరల్), మహిళా జనరల్-13 (వార్డులు 8,11,14,16,17,18,20,24,30,31,35,38,40), అన్‌రిజర్వుడ్-11 (వార్డులు 10,12,13,15,21,23,28,34,37,39,41)గా కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *