మదనపల్లె,అక్టోబర్ 13:మదనపల్లె రూరల్ మండలంలోని ఈశ్వరమ్మ కాలనీలో రూ.40 లక్షల నిధులతో నూతనంగా మంజూరైన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా భూమి పూజ నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాలనీలో రోడ్ల నిర్మాణం కోసం మంజూరైన నిధులతో చేపట్టనున్న పనులకు భూమి పూజ చేసి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

