నిమ్మనపల్లె, జూలై 30: (gtvmedia)
మదనపల్లె శాసనసభ్యులు ఎం. షాజహాన్ భాష నిమ్మనపల్లె మండలంలోని రాచవేటివారిపల్లె పంచాయతీ పరిధిలోని ఎగువమాచిరెడ్డిగారిపల్లె, రెడ్డివారిపల్లె గ్రామాల్లో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగువమాచిరెడ్డిగారిపల్లెలో రూ.13 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ప్రజలు చెప్పారని, కూటమి ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
గ్రామస్థులు సిమెంట్ రహదారులు, మురుగు కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఎమ్మెల్యేను కోరగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు.
తదనంతరం ఇటీవల ప్రమాదానికి గురైన మండల తెలుగు యువత అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డిని పరామర్శించి, తవలం పంచాయతీ నల్లవారిపల్లిలో సూర్యనారాయణ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్.జే. వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న, సింగిల్ విండో అధ్యక్షుడు కోట రమణ, మాజీ క్లస్టర్ ఇన్‌చార్జి మునిరత్నం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చింతపర్తి రెడ్డప్పరెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు శివకృష్ణ, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, నరసింహారెడ్డి, జయప్ప, జనసేన నాయకుడు ప్రదీప్ సింగ్, మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి విజయ్ సురేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్, ఈవోపీఆర్‌డీ రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవోలు బాలరాజు, లక్ష్మీపతి యాదవ్, ఎస్సై రామకృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
