మదనపల్లె, అక్టోబర్ 3 : అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్న విబిజి రాంజీ ఉపాధి హామీ సిబ్బందికి జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ ఎదుట జిల్లాలో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడేలుగా ఉపాధి హామీ పథకం సిబ్బందికి వేతనాలు పెంచాలని పలుమార్లు అర్జీలు అందజేశామన్నారు. అయినా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదని, అందుకే ఈనెల 10వ తేదీ వరకు సమయం ఇస్తున్నామన్నారు. అంతలోపు ప్రభుత్వ స్పందించి తమకు వేతనాలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో మాధవి మురళి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
ఉపాధి హామీ పథకం సిబ్బందికి జీతాలు పెంచాలి
