మదనపల్లె, ఆగస్టు 15: (gtvmedia)ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్య భారతదేశమని పలువురు పేర్కొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని అప్పారావు వీధిలో గల లైబ్రరీ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
