మదనపల్లె, జూలై 29: (gtvmedia)గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె పట్టణంలోని పలు సాయిబాబా ఆలయాలను ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా బుధవారం సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీల ఆహ్వానం మేరకు బర్మవీధిలోని సాయిబాబా ఆలయం, బైపాస్ వై-జంక్షన్ సమీపంలోని సాయిమందిరం, సాయికొండ ఆలయాలను ఆయన సందర్శించి బాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రాభివృద్ధి కొనసాగాలని ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
