ఇన్‌స్పైర్ మనక్‌పై డివిజన్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం

ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్టుల నామినేషన్‌ తప్పనిసరి: జిల్లా సైన్స్ అధికారి

మదనపల్లె, సెప్టెంబర్ 1: gtvmedia
అన్నమయ్య జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్ మనక్ కార్యక్రమంపై డివిజన్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం మదనపల్లె జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని సుమారు 15 మండలాల నుంచి సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇన్‌స్పైర్ మనక్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా 5 ప్రాజెక్టులను నామినేట్ చేయాలని ఉపాధ్యాయులకు అధికారులు సూచించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం, వినూత్న ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా ప్రాజెక్టులను రూపొందించి నామినేట్ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సైన్స్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇన్‌స్పైర్ మనక్ కార్యక్రమం కేవలం సైన్స్ సబ్జెక్టుకే పరిమితం కాదని తెలిపారు. మ్యాథ్స్, సోషల్ తదితర సబ్జెక్టులకు సంబంధించిన వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులను కూడా విద్యార్థులు రూపొందించవచ్చని వివరించారు. ప్రతి పాఠశాల చురుకుగా పాల్గొని నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

అన్నమయ్య జిల్లా ఇన్‌స్పైర్ మనక్ నామినేషన్లలో ప్రతి ఏడాది ముందంజలో నిలుస్తోందని జిల్లా సైన్స్ అధికారి జీ. శ్రీధర్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది కూడా జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులను తప్పనిసరిగా నామినేట్ చేయాలని కోరారు. అత్యుత్తమ ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు.

జిల్లా సైన్స్ అధికారి జీ. శ్రీధర్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 15 మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ సెషన్లలో ఇన్‌స్పైర్ మనక్ కార్యక్రమంపై పూర్తి స్థాయి అవగాహన, సూచనలు, సలహాలు అందించారు.

కార్యక్రమంలో ఆర్పీలు పి.ఎల్.ఎన్. శాస్త్రి, భద్రి, హేమంత్ కుమార్, వరప్రసాద్, భాస్కర్, డీసీఈబీ గంగాధర్ తదితరులతో పాటు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *