మదనపల్లె, అక్టోబర్ 2: మదనపల్లెలో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ గంగారపు రామదాస్ చౌదరి కలిశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో రామదాస్ చౌదరి ఆత్మీయంగా మాట్లాడారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో మదనపల్లె, రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్న నేపథ్యంలో కార్యక్రమం ప్రాధాన్యతపై చర్చించారు.
