ఆంగ్లభాషపై పట్టు సాదించాలి

మదనపల్లె, సెప్టెంబర్ 29: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ రామలింగారెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం. ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ చెందిన హ్యూమానిటీస్ & సైన్సెస్ విభాగం అధ్యాపకులు కె. ఈశ్వర్ రెడ్డి సహ రచయితగా “English for Competitive Examinations” అనే పాఠ్యపుస్తకం వెలువడింది.
SCIRO ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ ద్వారా ప్రచురించబడిన ఈ పుస్తకం ముఖ్యంగా III B.Tech విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా రూపొందించబడిందని రామలింగారెడ్డి పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో అవసరమైన ఆంగ్ల భాషా నైపుణ్యాలు, వ్యాకరణం, పదజాలం, రీడింగ్ కాంప్రహెన్షన్ తదితర అంశాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఇందులో పొందుపరిచారన్నారు.
ఈ సందర్భంగా పుస్తక రచయిత కె. ఈశ్వర్ రెడ్డిని కళాశాల డైరెక్టర్ డా. ఎస్. రామలింగారెడ్డి, ప్రిన్సిపాల్ డా. పి. రాయుడు, హెచ్ & ఎస్ విభాగాధిపతి డా. టి. అమరనాథ రెడ్డి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *