హార్సిలీ హిల్స్‌లో కూటమి నేతల కీలక సమీక్ష

హార్సిలీ హిల్స్‌లో కూటమి నేతల కీలక సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన.. కూటమి సమన్వయంపై చర్చ

హార్సిలీ హిల్స్: అన్నమయ్య జిల్లా హార్సిలీ హిల్స్‌లోని వీఎస్‌ఆర్ విండ్ వేవ్ రిసార్ట్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి నాయకులు కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రామాలు, మండలాల వారీగా రాజకీయ పరిస్థితులు, కూటమి పార్టీల మధ్య సమన్వయంపై చర్చించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి, పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి వై. మధుసూదన్ నాయుడు, తంబళ్లపల్లె ఇన్‌చార్జి జి. శంకర్ యాదవ్‌తో పాటు జిల్లా స్థాయి కూటమి నాయకులు పాల్గొన్నారు.

గ్రామాలు, మండలాల వారీగా నెలకొన్న రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తూ, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావడం, కూటమి పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని, కూటమి ఐక్యతను కాపాడుకుంటూ విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

GTV MEDIA — ప్రజల పక్షం.. నిజాలే మా నిబద్ధత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *