మదనపల్లె, అక్టోబర్ 4: మదనపల్లిలో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మదనపల్లి చేనేత కళాకారుల ప్రతిభకు ప్రత్యేక గౌరవం లభించింది.

ఈ సందర్భంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి మదనపల్లి చేనేత కార్మికులు తమ చేతులతో ప్రత్యేకంగా నేసిన పట్టు వస్త్రాలను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రేమపూర్వకంగా పట్టుకానుకగా అందజేశారు.
మదనపల్లి చేనేత కళాకారుల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ఈ పట్టు వస్త్రాలను అందించడం ద్వారా స్థానిక చేనేత కళకు వేదికపై ప్రత్యేక గుర్తింపు లభించింది. తమ సంప్రదాయ నైపుణ్యంతో తయారు చేసిన వస్త్రాలను ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అనంత్ అంబానీకి అందించడం పట్ల చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.
మదనపల్లి చేనేతకు ఉన్న ప్రత్యేకతను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వేదికలపై పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని స్థానికులు పేర్కొన్నారు.
