మదనపల్లె, సెప్టెంబర్ 18: మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువులోకి కృష్ణా జలాలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా స్థానిక కూటమి నాయకులతో కలిసి చెరువు వద్ద జరుగుతున్న జంగిల్ క్లీనింగ్ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “అమ్మచెరువును కృష్ణా జలాలతో నింపుతానని ఇచ్చిన మాటకు కట్టుబడి, నేడు చెరువులోకి కృష్ణా జలాలు చేరుతున్నాయి” అని తెలిపారు. చెరువులో నీటిని నిల్వ చేసేందుకు అనవసరంగా పెరిగిన చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నట్లు చెప్పారు.
నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలోని 90కి పైగా చెరువులను నింపేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
