సెప్టెంబర్ 17:
ఆకాశంలో సోమవారం అరుదైన, అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. చంద్రుడికి అత్యంత సమీపంగా శుక్ర గ్రహం దర్శనమిచ్చింది. జాబిల్లి పక్కనే ప్రకాశవంతంగా మెరిసిన శుక్రుడిని పలువురు ఆసక్తిగా వీక్షించారు.
ఈ అరుదైన ఖగోళ దృశ్యం అమలాపురం పరిసర ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని బాలుర్ఘట్లో కూడా కనిపించింది. ఆకాశంలో చంద్రుడు, శుక్ర గ్రహం కలిసి కనిపించిన దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
