తిరుపతి జిల్లా పోలీసు శాఖతేదీ: 17-09-2026

  • శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు!
  • పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం బాధ్యతా రాహిత్యం.
  • “వాస్తవానికి సదరు ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు!” అని … టిటిడి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అయ్యింది..!
  • దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
  • టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
  • ఫొటో మూలం, వాస్తవికత, ప్రచారం చేసిన వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోంది.
  • నిర్ధారణ కాని ఫొటోలు, పోస్టులు షేర్ చేయవద్దు.

📵 తప్పుడు సమాచారాన్ని వైరల్ చేయవద్దు.

  • నిర్ధారణ కాని ఫొటోలు, వీడియోలు, పోస్టులు ఫార్వర్డ్/షేర్ చేయవద్దు.
  • సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మవద్దు.
  • అధికారిక సంస్థలు విడుదల చేసే సమాచారాన్నే విశ్వసించండి.
  • తప్పుడు సమాచారం కనిపిస్తే మరింత వైరల్ చేయకుండా అధికారులకు సమాచారం ఇవ్వండి.

⚖️ చట్టపరమైన చర్యలు.

భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా
ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేసినట్లు దర్యాప్తులో తేలితే, అమలులో ఉన్న చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం.

భక్తులకు విజ్ఞప్తి!.

పవిత్ర శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంయమనం పాటించండి.

  • అపోహలను నమ్మవద్దు.
  • తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సహకరించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *