ప్రభుత్వ భూముల పరిరక్షణకు, కార్యకలాపాలపై సమగ్ర విచారణ తహసీల్దార్‌కు వినతిమదనపల్లె, సెప్టెంబర్ 16:మదనపల్లె మండలం, బసినకొండ పరిధిలోని ప్రభుత్వ భూములు, వాటి అక్రమ వినియోగం సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్తహసీల్దార్ మాధవికి వినతి పత్రం ఇచ్చారు.పునీత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాల కోసం బసినకొండ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి, అనధికారికంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నరన్నారు.

అసలు రికార్డుల పరిశీలించి 1-B, అడంగల్, RSR మరియు FMB రికార్డులను పరిశీలించి భూముల వాస్తవ స్థితిని నిర్ధారించాలన్నారు.
భౌతిక తనిఖీ సర్వే చేసి క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, స్పష్టమైన హద్దులతో నివేదిక రూపొందించాలన్నారు.
పట్టణంలోని విలువైన ప్రభుత్వ ఆస్తులను కాಪಾడే వరకు ప్రజాక్షేత్రంలో తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *